Mana Mahati News - ఢిల్లీ / హైదరాబాద్ : *దమ్ముంటే పట్టుకోండి..ఈమె పేరు రుజా*. ఢిల్లీ/హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 30 . అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ కే సవాల్ విసిరింది. రుజా ఆచూకీ చెబితే 50లక్షల డాలర్లు బహుమ తి ఇస్తారు. ఆమె కోసం గత ఏడేళ్లుగా ఎఫ్ బీఐ ప్రపంచ వ్యాప్తంగా గాలిస్తోంది .అయినా ఆమెను పట్టుకోలేక పోతుంది. ఆమెకు చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు. పటిష్ట రక్షణతో ఆమె ప్రపంచంలో ఎక్కడో ఉంటుంది. అయితే ఎక్కడుందో ఇప్పటివరకు ఎఫ్ బీఐ తెలుసుకోలేక పోతుంది. ఇంతకీ రుజా ఎవరో తెలుసా..? వన్ కాయిన్ క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రజలను 500 కోట్ల డాలర్లు మోసం చేసింది. ఆ వెంటనే దేశం వదిలి ఎక్కడికో పారిపోయింది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్లు బహుమతి కూడా ఎస్బిఐ ప్రకటించింది. అయినా ఆమె దొరకలేదు. ఇదివరకే ఆమె ప్రియుని ,ఆమె సోదరుని ఎఫ్ బీఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. కానీ రుజా మాత్రం ఇంతవరకు దొరకలేదు. 2014లో 1 కాయిన్ అనే కంపెనీకి ప్రమోటర్ ప్రచారంలోకి వచ్చింది. మరోక్రిప్టో కరెన్సీ కంపెనీ బిట్ కాయిన్ కు గట్టి సవాల్ విసిరింది . ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆమె కంపెనీ వన్ కాయిన్ లో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులకి అయిదింతలు లేదంటే పదింతలు లాభాలు ఇస్తానని కూడా ఆమె చెప్పింది. నిజం తెలుసుకునే లోపు పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తన కంపెనీలో పెట్టుకుని పెట్టిన వాళ్ళు పిచ్చి వాళ్లని 2014లోని ఆమె తన పార్టనర్ కు ఒక ఇమెయిల్ లో కూడా సమాచారం పంపింది. సంపాదించుకున్న డబ్బుతో దేశం విడిచి వెళ్ళిపోదాం అని కూడా ఆ మెయిల్ లో ఆమె తెలియజేసింది . 2017 అక్టోబర్ 12 ఆమెను అమెరికా చట్టం కింద మోసం మరియు దగా నేరాలు కింద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసేందుకు వారెంటు కూడా ఇచ్చింది. అయితే ఈ వారెంట్ అందుకున్న రెండు వారాల తర్వాత ఆమె ఒక విమానంలో బల్గేరియా నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. అప్పటినుంచి ఆమె ఆచూకీ లేదు. రుజా గల్ఫ్ దేశాలలో కానీ, జర్మనీ, రష్యా లేదా తూర్పు యూరప్ దేశాల్లో కానీ ఉండవచ్చునని భావిస్తున్నారు . ఆమె తన ఆచూకీ తెలుసుకోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోని ఉండవచ్చని కూడా ఎఫ్బిఐ భావిస్తుంది. ఇప్పటివరకు కనుక్కోలేక పోతుంది. ఆమె కోసం ఇంటర్ పోల్ గాలిస్తూనే ఉంది.
Admin
Mana Mahati News