Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక* ఖమ్మం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించిన *నాగేశ్వర్ రావు పదవీ విరమణ* సందర్భంగా సోమవారం రాత్రి ఏదులాపురం మున్సిపాలిటీ జలగంనగర్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* హాజరై పదవీ విరమణ పొందిన నాగేశ్వర్ రావును సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన ఆర్టీసీ శాఖకు అందించిన సేవలను కొనియాడారు.
Admin
Mana Mahati News