Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ* ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డు పరిధిలోని 28వ వార్డు షాబాద్ నగర్ కు చెందిన *రంగిశెట్టి ఉదయ్, శ్రావణి దంపతుల కుమార్తె చిన్నారి వైదిక* ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి *గౌ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి* గారు బుధవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు ఉన్నారు.
Admin
Mana Mahati News