Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : 'పవన్ కళ్యాణ్' అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. అదొక బలమైన భావోద్వేగం, కోట్లాది మంది అభిమానుల గుండెచప్పుడు. వెండితెరపై ఆయన నడిచొస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి..
ప్రజాక్షేత్రంలో ఆయన గొంతు విప్పితే లక్షలాది మందిలో పోరాట స్ఫూర్తి రగులుకుంటుంది. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి, తనదైన మేనరిజం, నటన, విలక్షణ వ్యక్తిత్వంతో మహాశక్తిగా ఎదిగారాయన. నటుడిగా శిఖరాగ్రాన ఉన్నప్పుడే ప్రజాసేవ కోసం అన్ని భోగాలను తృణప్రాయంగా వదులుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దశాబ్ద కాలం పాటు ఎదురైన అవమానాలు, ఓటములను గుండె ధైర్యంతో తట్టుకుని.. 2024లో ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. నేడు (సెప్టెంబర్ 2) ఆయన పుట్టినరోజు సందర్భంగా 'సమయం' అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇది.
కళ్యాణ్ కుమార్ నుంచి కళ్యాణ్ బాబుగా.. కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు 1971, సెప్టెంబర్ 2న బాపట్లలో మూడో కుమారుడిగా జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు కళ్యాణ్ కుమార్. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముద్దుగా 'కళ్యాణ్ బాబు' అని పిలిచేవారు. . తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల యాసలు, సంస్కృతులు, సామాన్య ప్రజల కష్టాలను ఆయన చిన్నతనం నుంచే దగ్గరిగా గమనించారు. చిన్ననాటి ఆర్థిక ఇబ్బందులు, పేదరికం ఆయన మనసును బలంగా ప్రభావితం చేశాయి.
Admin
Mana Mahati News