Sunday, 13 September 2026 10:13:18 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది*

Date : 28 April 2026 06:54 AM Views : 213

Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* మన మహతి న్యూస్ ప్రతినిధి పాల్వంచ:వాసవి మాత జయంతి పండుగ ఆర్యవైశ్య సమాజానికి ఎంతో పవిత్రమైనది.ఈ పండుగ ప్రాముఖ్యత అహింసా సిద్ధాంతం మరియు త్యాగం.వాసవి మాత అనగా శ్రీ కన్యకా పరమేశ్వరి అహింస ను ప్రాణప్రదంగా భావించిన దేవత.ఒక రాజు తనను బలవంతంగా వివాహం చేసుకోవాలని కోరినప్పుడు,రక్తపాతాన్ని నివారించడానికి ఆమె అగ్నిప్రవేశం చేసి ఆత్మబలిదానం చేసుకుంది.ఆర్యవైశ్య సమాజానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచి,అన్యాయానికి లొంగని ధైర్యాన్ని మరియు శాంతిని కాపాడే గొప్పతనాన్ని నేర్పుతుంది.ఈ పండుగ ద్వారా వైశ్యులు తమ కులదైవాన్ని స్మరించుకుంటూ,కుటుంబ విలువలను పెంపొందించుకుంటారు.అమ్మవారికి పంచామృతాభిషేకాలు,కుంకుమార్చనలు మరియు వేదమంత్రోచ్ఛారణలతో కూడిన పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని భక్తుల నమ్మకం విద్య,కళ,సంగీతం, మరియు నృత్యం పట్ల అమ్మవారికి ఉన్న ఆసక్తిని స్మరించుకుంటూ, సమాజంలో సంస్కృతిని, క్రమశిక్షణను గౌరవిస్తారు.ఈ జయంతి వేడుకలు ఆర్యవైశ్యులలో ఐక్యతను,సోదరభావాన్ని మరియు సామాజిక స్పృహను పెంపొందిస్తాయి.ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగ గా గుర్తించి అధికారికంగా ప్రకటించడం ఈ పండుగకు ఉన్న సామాజిక ప్రాముఖ్యతను మరింత పెంచింది.ఇది సమాజంలోని అహింస,ధర్మం మరియు నైతిక విలువలకు దక్కిన గౌరవంగా భక్తులు భావిస్తున్నారు.మొత్తంగా వాసవి మాత జయంతి అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు,అది ధర్మం మరియు శాంతి మార్గంలో పయనించే మానవుడికి మార్గదర్శకమైన పండుగ. ఇటువంటి ఈ పండుగను పాల్వంచ పట్టణంలో ఈరోజు ఆర్యవైశ్య జిల్లా నాయకురాలు పెండ్యాల రోజు లక్ష్మి మరియు మాలే రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల రోజా లక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి అమ్మవారు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు జన్మించిన సంతానం అని దైవాంశ సంభూతురాలు,రాజు భారీ నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆర్యవైశ్యుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి తనతో పాటు 102 గోత్రాల వారిని హోమగుండం ఏర్పరచుకొని అగ్నిప్రవేశం చేసుకుందని అప్పుడు శ్రీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారిని అతనిలో ఐక్యం చేసుకున్నారు అని తెలిపారు. ఈ ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 50 కేజీల మల్లెపూలతో పూలాభిషేకం ప్రత్యేక అభిషేకాలు,అర్చనలు, నిర్వహించడంతో పాటు, భక్తులకు ప్రసాదాలు,అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు.అమ్మవారి ఆశీస్సులతో సమాజంలో శాంతి,సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చలవాది రాజ్యలక్ష్మి, చిల్లంచర్ల అనిత, తాటికొండ స్వప్న,బిందు, మణి,భారతి, వైశ్య సంఘ పెద్దలు,మహిళలు, యువకులు పాల్గొన్నారు. వారు అమ్మవారి జీవితం నుండి ధర్మం, నిజాయితీ, త్యాగం వంటి విలువలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: