Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు మన మహతి న్యూస్ ఖమ్మం బీబీఎం హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణల్లో పాల్గొని అలరించారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గోపాల్‌రావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కాంతారావు, కరస్పాండెంట్ నాగమణి, ప్రిన్సిపల్ గోపాల్‌రావు, వైస్ ప్రిన్సిపల్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News