Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి ఉద్యోగం నుండి తొలగించాలి టి ఆర్ ఎస్ పార్టీ డిమాండ్ టిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిపై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చట్టాన్ని పోలీస్ శాఖ క్రమశిక్షణను ఉద్యోగ నియమావళిని గౌరవించవలసిన బాధ్యత కలిగి ఉంటారని అలాంటి వ్యక్తి ఒక పోకిరిలా వ్యవహరిస్తూ మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం సమర్ధనీయం కాదు క్షమారార్థం కాదు అని అన్నారు కానిస్టేబుల్ కే అనిల్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి వర్తించే చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి శాఖా పరమైన విచారణ చేపట్టి ఉద్యోగం నుంచి తొలగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పోలీసు యూనిఫాంలో ఉన్న ప్రతి వ్యక్తి చట్టానికి లోబడి ప్రజలకు ఆదర్శంగా వ్యవహరించాలి రాజకీయ భేదాలు ఉండవచ్చు కానీ ఒక మహిళ ప్రజా ప్రతినిధి రాజకీయ నాయకురాలిపై వ్యక్తిగతంగా అనుచితంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యవహారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని భానోత్ కిషన్ నాయక్ స్పష్టం చేశారు ఈ విషయమై ఖమ్మం నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు అరెస్టు శాఖపరమైన విచారణ నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింప వంటి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా నాయకురాలు గట్టు కరుణ బానోతు వినోదాభాయి ఎస్కే నావాజ్ ఎండి షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు ఉద్యమాభివందనాలతో బానోతు కిషన్ నాయక్ TRS పార్టీ రాష్ట్ర నాయకులు
Admin
Mana Mahati News