Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు రాజుపేట గ్రామం లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. "జై భీమ్" నినాదాలతో మారుమోగింది రాజుపేట గ్రామం . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొర్ర రమేష్ గారు పాల్గొని, అంబేద్కర్ గారి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొర్ర రమేష్ గారు ఆయన భార్య కొర్ర రమాదేవి మాట్లాడుతూ.. "కులం, మతం లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా అంబేద్కర్ గారు చేసిన కృషి ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు బలహీన వర్గాలకు, మహిళలకు సమాన హక్కులు లభిస్తున్నాయి" అని కొనియాడారు. సబ్బు నాగయ్య ప్రజా కవి రాంకి జానకి రామయ్య మందుల ప్రసాద్ ఉప్పుల వీరభద్రం ఉదయ్ సెపి పాల్గొన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు గ్రామ జై భీమ్ సంఘాల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
Admin
Mana Mahati News