Sunday, 13 September 2026 10:22:46 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *డిజిటల్ అరెస్ట్ పేరుతో అద్దంకిలో భారీ దోపిడీ రిటైర్డ్ బ్యాంకర్ నుంచి రూ. 1.23 కోట్లు మాయం*

Date : 08 January 2026 10:29 PM Views : 196

Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *డిజిటల్ అరెస్ట్ పేరుతో అద్దంకిలో భారీ దోపిడీ రిటైర్డ్ బ్యాంకర్ నుంచి రూ. 1.23 కోట్లు మాయం* ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జనవరి 8 కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ వీడియో కాల్‌లో బెదిరింపులు - 24 గంటల పాటు బాధితుడిని గృహనిర్బంధంలో ఉంచి సొమ్ము కాజేసిన కేటుగాళ్లు - సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరిక ప్రకాశం జిల్లా అద్దంకి సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను, చదువుకున్న వారిని కూడా నిలువునా ముంచేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, 'డిజిటల్ అరెస్ట్' అనే నయా మోసంతో ఏకంగా రూ. 1,23,00,000 (కోటి ఇరవై మూడు లక్షలు) స్వాహా చేశారు. బాధితుడైన రిటైర్డ్ బ్యాంకర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. "మీ ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. తైవాన్ నుండి డ్రగ్స్ పార్శిల్స్ మీ పేరుతో వెళ్లాయి. దీనిపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది" అని భయపెట్టారు. 24 గంటల 'డిజిటల్ అరెస్ట్' నిజమైన అధికారులుగానే నమ్మించిన నేరగాళ్లు, బాధితుడిని తన ఇంట్లోనే ఒక గదిలో ఉండాలని, ఎవరికీ ఫోన్ చేయకూడదని (డిజిటల్ అరెస్ట్) ఆజ్ఞాపించారు. స్కైప్ (Skype) ద్వారా 24 గంటల పాటు ఆయనను వీడియో పర్యవేక్షణలో ఉంచారు. కేసు నుంచి బయటపడాలంటే తమ 'సెక్యూరిటీ అకౌంట్'కు డబ్బు పంపాలని, దర్యాప్తు తర్వాత తిరిగి ఇస్తామని నమ్మబలికారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని విడతల వారీగా సుమారు రూ. 1.23 కోట్లను వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేరింది.. దీనిపై అద్దంకి సీఐ కేసు ఆప్తు చేస్తున్నారు..

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: