Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *తిరుమల* *వెలుగు లోకి భారీ కుట్రలు..* తిరుమల నివాస్ న్యూస్ జనవరి 8 తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వాన్ని, T.T.D.ని, పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని... బయటి నుంచి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయగా... మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. కుట్ర కోణం వెనుక సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
Admin
Mana Mahati News