Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ???? బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు సంగారెడ్డి, మార్చి 26, మన మహతి న్యూస్ : మానవ అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో A1గా ఉన్న జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాష్ రెడ్డి), A3గా ఉన్న కుసుమ కుమార్‌లపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో నమోదు చేసిన ఈ కేసులో ఆరోపణలు నిరూపణ కాలేదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం, సాక్ష్యాధారాల లేమి కారణంగా నేరాలు రుజువు కాలేదని పేర్కొంది. ఈ కేసులో భారతీయ దండన చట్టం (IPC)లోని సెక్షన్లు 419, 420, 467, 468, 471, 409, 370తో పాటు భారత పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 12 మరియు ఇమ్మిగ్రేషన్ చట్టం సెక్షన్ 24 కింద నమోదు చేసిన కేసులన్నింటి నుంచి కూడా ఇద్దరినీ విముక్తి కల్పించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది జి. సంతోష్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా A1, A3 ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. తీర్పు సారాంశం: కేసు పరిష్కారం: నిర్దోషుల విడుదల (Acquittal) తీర్పు తేదీ: 26-03-2026 కోర్టు: MPలు/MLAల ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ తీర్పుతో రాజకీయంగా కూడా చర్చనీయాంశం కావడంతో పాటు, గతంలో నమోదైన కేసులపై కొత్త చర్చకు దారితీసింది.
Admin
Mana Mahati News