Sunday, 13 September 2026 10:18:13 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

సర్పంచ్ – ఉప సర్పంచ్‌కు ప్రభుత్వం కఠిన హెచ్చరిక* *జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు జైలు శిక్ష తప్పదు!*

Date : 30 December 2025 11:02 PM Views : 780

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *సర్పంచ్ – ఉప సర్పంచ్‌కు ప్రభుత్వం కఠిన హెచ్చరిక* *జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు జైలు శిక్ష తప్పదు!* *జాయింట్ చెక్ పవర్ ప్రాముఖ్యత* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 30 గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం కీలకమైన భద్రతా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి పనుల కోసం వెచ్చించే ప్రతి రూపాయికి వీరిద్దరి ఆమోదం తప్పనిసరి. అయితే వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా చెక్ పవర్‌ను అడ్డుకోవడం గ్రామాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. *పారదర్శకతతోనే చట్టపరమైన రక్షణ* గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతి నిర్ణయం తప్పనిసరిగా గ్రామసభ తీర్మానం ద్వారానే జరగాలని ఆదేశించారు. నగదు లావాదేవీలకు బదులుగా ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖర్చుల వివరాలను సమయానుకూలంగా రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా ఆడిట్ తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. పారదర్శకత పాటిస్తేనే ప్రజా ప్రతినిధులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని హెచ్చరించారు. *అధికార దుర్వినియోగానికి కఠిన శిక్షలు* ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడటం, పనులు పూర్తికాకుండానే బిల్లులు డ్రా చేయడం, తప్పుడు లెక్కలు చూపడం, సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పదవి నుంచి తొలగించడమే కాకుండా జైలు శిక్ష విధించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని పేర్కొంది. *ఆధిపత్య పోరుతో అభివృద్ధికి బ్రేక్?* కొన్ని గ్రామాల్లో సర్పంచ్ – ఉప సర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని అధికారులు గుర్తించారు. రాజకీయ కారణాలతో కావాలనే బిల్లులపై సంతకాలు చేయకుండా పనులను నిలిపివేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించింది. విచారణలో అభివృద్ధిని అడ్డుకున్నట్లు తేలితే, ఉప సర్పంచ్‌కు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉందని స్పష్టం చేసింది...

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: