Sunday, 22 March 2026 03:49:42 PM
# భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...* # *తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక....* # *జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు పితృ వియోగం....* # *కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!...* # *జ్ఞానేష్ మానస మ్యారేజ్ రిసెప్షన్ లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, విజయ హేమ నాయక్ బిజెపి మదన్, సుధాకర్, సుందర్..* # *శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన* # *విశ్వజనని ఫౌండేషన్ విశిష్ట పురస్కార గ్రహీత ​ఏలే బాలకృష్ణ...* # *అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఎన్నిక...* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....* డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..!* # *నూతన వధువరులని ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # *????సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..* పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్* # *అక్రమంగా విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లు...*

*రోడ్డు భద్రతే కుటుంబ భవిష్యత్‌ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ నర్సంపేటలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో డఫోడిల్స్ పాఠశాల సంపూర్ణ మద్దతు విద్యతో పాటు విలు

Date : 09 January 2026 05:34 AM Views : 357

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : రోడ్డు భద్రతే కుటుంబ భవిష్యత్‌ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ నర్సంపేటలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో డఫోడిల్స్ పాఠశాల సంపూర్ణ మద్దతు విద్యతో పాటు విలువలు, బాధ్యతలను నేర్పడమే డఫోడిల్స్ లక్ష్యం - డఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ నర్సంపేట : రోడ్డు భద్రత పాటిస్తేనే కుటుంబ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు . జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం నర్సంపేట పట్టణ కేంద్రంలో నర్సంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.హెల్మెట్ లేకపోతే రైడ్ కాదు… సీటు బెల్ట్ లేకపోతే డ్రైవ్ కాదు అనే నినాదాలతో నిర్వహించిన బైక్ ర్యాలీలో డఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన డీసీపీ అంకిత్ కుమార్, హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు, సీట్ బెల్ట్ వినియోగించిన నాలుగు చక్రాల వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేస్తూ అభినందిస్తూ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ…రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని అన్నారు.అనంతరం డఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ…రోడ్డు భద్రత ఒక రోజు కార్యక్రమం కాదు… ఇది జీవితాంతం పాటించాల్సిన బాధ్యత. అందుకే మా డఫోడిల్స్ పాఠశాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలు అలవాటు చేస్తే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. విద్యతో పాటు విలువలు, బాధ్యతలను నేర్పడమే డఫోడిల్స్ లక్ష్యం అని భవిష్యత్తులో కూడా రోడ్డు భద్రత వంటి సామాజిక కార్యక్రమాల్లో డఫోడిల్స్ పాఠశాల ముందుండి పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం లో సీఐ రఘపతి రెడ్డి, అరుణ్ కుమార్, పోలీస్ శాఖ, డఫోడిల్స్ పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్ ,డీన్ ఇందుమతి,ప్రధానోపాద్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ రీటా, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :