Saturday, 12 September 2026 09:01:23 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు*

Date : 09 January 2026 01:57 PM Views : 238

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 9 బాలలపై లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ, సామాజిక మాధ్యమ వేదికల్లో అప్‌లోడ్‌ చేసి, ప్రసారం చేసిన ఆరోపణలపై ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కంబేటి సత్యమూర్తి (39)గా గుర్తించారు. ఇతడు వైరల్‌ హబ్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తూ.. అభ్యంతరకరమైన, పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఈ వీడియోల్లో 18 ఏళ్ల లోపున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో నిందితుడు కావాలనే పిల్లలను అసభ్యకరమైన, లైంగికపరమైన అశ్లీల ప్రశ్నలు అడగటమే కాకుండా.. మైనర్లు ముద్దులు పెట్టుకునేలా ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.2025 అక్టోబరు 16న వైరల్‌హబ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నట్లు గుర్తించిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతికపరమైన దర్యాప్తులో సత్యమూర్తిని నిందితుడిగా గుర్తించారు. అతడు 2018 నుంచి యూట్యూబర్‌గా పనిచేస్తూ.. వైరల్‌హబ్‌007 అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేసి, వ్యూస్‌ పెంచుకొని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతడు బాలల రక్షణ చట్టాలు, సైబర్‌ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పారు. సైబర్‌ ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఎస్‌ఐ సురేశ్‌ తమ బృందంతో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :