Saturday, 12 September 2026 09:00:18 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది*

Date : 28 December 2025 10:03 PM Views : 239

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *జీఎస్టీ సంస్కరణలు దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది* *ఎం. వెంకయ్య నాయుడు* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 28 డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు వెంకయ్య నాయుడి అభినందన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన జీఎస్టీపై గ్రంథాన్ని హైదరాబాద్‌లోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావును ఆయన అభినందించారు. జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన, విప్లవాత్మక మార్పులకు నాంది పలికినవని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి అనే అంశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి జీఎస్టీ సంస్కరణలను విశ్లేషించిన తీరు ఈ గ్రంథానికి ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఏకీకరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడిన విధానం, పారదర్శకత పెరగడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలగడం వంటి అంశాలను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదించిందని తెలిపారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య ఆర్థిక సమన్వయం బలోపేతం కావడంలో జీఎస్టీ పాత్రను కూడా ఈ రచన సమగ్రంగా వివరించిందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణలను కేవలం గణాంకాల పరంగా కాకుండా, ప్రజల జీవితాలతో అనుసంధానిస్తూ సామాజిక కోణంలో విశ్లేషించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన పెంపొందించడంలో ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రంథాన్ని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరణ అనంతరం ఈ రచనకు లభించిన స్పందన జీఎస్టీ అంశంపై సమాజంలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల ఉద్దేశ్యం, అమలు విధానం, ప్రజలపై వాటి ప్రభావాన్ని సుస్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. తన రచనకు ఆశీస్సులు, ప్రోత్సాహం అందించిన వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: