Monday, 14 September 2026 11:57:31 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.*

Date : 11 January 2026 07:28 AM Views : 332

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* మోడెం ప్రమీల అనే వివాహిత కస్బాబజార్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. అయితే ఇటీవల ఆమె పని ముగించుకుని రూమ్‌కి వెళ్లే క్రమంలో జీవీ మాల్ వద్ద ఆమెపై దాడి చేసిన వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన బి. నరసింహా రావు అనే RMP డాక్టర్, ప్రమీల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో వీరు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అయితే వీరు విడిపోవడానికి ముందు పాల్వంచలోని శ్రావణ్‌ అనే వ్యక్తి ఇంట్లో రెంట్‌కు ఉన్నారు. ఆ సమయంలో వీరితో శ్రావణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రమీల మధ్య వర్తిగా ఉండి శ్రవణ్‌కు డబ్బులు ఇప్పించింది. అయితే అవి తిరిగివ్వాలని ప్రమీల అడగ్గా.. నువ్వా నాతో ఉంటేనే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని శ్రవణ్ ఆమెను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని.. ఆమె భర్త ఆరోపించాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. అయితే ఆ శ్రవణే తన భార్యను హత్య చేసి ఉంటాని భర్త నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాల అధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :