Monday, 14 September 2026 10:56:30 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*జర్నలిస్టును బెదిరించిన హీరో చంద్రహాస్.. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు...*

Date : 05 February 2026 11:14 AM Views : 209

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : జర్నలిస్టును బెదిరించిన హీరో చంద్రహాస్.. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు వేదికపై అసభ్యకరంగా పాట పాడిన నటుడు చంద్రహాస్ భాష సరికాదన్న జర్నలిస్టుపై ఇన్‌స్టాలో బెదిరింపులు అశోక్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యువ నటుడు చంద్రహాస్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. తన సినిమా ప్రమోషన్ వేదికగా అసభ్యకర పాట పాటపాడటమే కాకుండా, దానిని ప్రశ్నించిన ఒక సీనియర్ జర్నలిస్టును సోషల్ మీడియా వేదికగా బెదిరించడంతో ఆయనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రహాస్ అసభ్య పదజాలంతో కూడిన పాటను పాడారు. ఒక నటుడిగా సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నిస్తూ 'బిగ్ టీవీ' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ ఒక వీడియోను విడుదల చేశారు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సింది పోయి, చంద్రహాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ జర్నలిస్టును హెచ్చరిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ వీడియో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అశోక్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినిమా ప్రచారంలో భాగంగా విభిన్నంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ, అది సభ్య సమాజం తలదించుకునేలా ఉండకూడదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్, మాటతీరుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఈ యువ హీరోకు, ఈ తాజా కేసు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :