Sunday, 13 September 2026 10:05:12 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ప్రేమలో మోసం… యువతి ఆత్మహత్య*

Date : 11 March 2026 05:45 PM Views : 226

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ప్రేమలో మోసం… యువతి ఆత్మహత్య* ఓ యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటన విషాదానికి దారితీసింది. మనస్తాపం చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహ*త్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. అయితే ఇటీవల పెళ్లి చేసుకుందామని మమత కోరగా… మత్స్యగిరి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత ఆత్మహ*త్యకు పాల్పడినట్లు సమాచారం. ఆదివారం మమత తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లగా, ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పేర్కొంటూ మమత ఒక నోట్ రాసింది. అనంతరం సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహ*త్య చేసుకుంది. బావి వద్ద నుంచి ఇంటికి వచ్చిన మమత సోదరి భవాని… ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు. #YadadriBhuvanagiri #Telangana

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :