Saturday, 12 September 2026 09:02:06 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*రూ.3.51 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ అధికారి*

Date : 03 January 2026 11:16 PM Views : 321

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *రూ.3.51 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ అధికారి* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖకు చెందిన ఓ అధికారి సహా మరో వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బిల్లులు మంజూరు చేయడానికి రూ.3.51 లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు. కొత్తగూడెం అటవీ సబ్‌ డివిజన్‌కు చెందిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసింది. జామాయిల్ కటింగ్ పనులకు సంబంధించి సుమారు 3,900 టన్నుల నీలగిరి చెట్ల నరికివేతకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందుకు కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ.3.51 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజేందర్, గోపాలకృష్ణలను లంచం తీసుకుంటుండగానే పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ ప్రజలను కోరింది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్ పేజీ Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) ఖాతా @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇచ్చింది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :