Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా మాత సావిత్రి భాయి ఫూలే కు భారతరత్న ప్రకటించాలి బీజేపీ ప్రభుత్వం దామాల సత్యం ఖమ్మం/జనవరి 3/ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిరవ్వంచి నయా బజార్ స్కూల్ గ్రౌండ్ లొ సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ప్రినిసిపాల్,హెమస్టర్ పాల్గొని, సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ — మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావిత్రి బాయి ఫూలే చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఉపాద్యాలకు సన్మానం చేసినారు అనంతరం విద్యార్థులకు పండ్లుమిఠాయిలు పంచినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వనిత,స్కూల్ హెడ్ మాస్టర్ ఉషా రాణి,ప్రముఖ అంబేద్కర్ వాది జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్,వార్డెన్ సైదులు, నివాస్ న్యూస్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్,ప్రియదర్శిని ప్రిన్సిపాల్ రామారావు, రాజేష్,టి ఎస్ ఎస్ ఏ నాయకులు మోహనచంద్, కొప్పుల రామారావు,సీనియర్ జర్నలిస్ట్ పాగా యోనా, అశోక్, నన్నే సాహెబ్, విద్యార్థులు, విద్యార్థినులు, సావిత్రి భాయి ఫూలే అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News