Monday, 14 September 2026 10:56:30 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ* ..*

Date : 17 January 2026 07:07 PM Views : 218

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో 3.90 కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1 లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో: 1. పసునూరి బసవ రాజు, వయసు: 32 సంవత్సరాలు యాదాద్రి జిల్లా. 2. జెల్లా పాండ, వయసు: 46 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా.3. మహేశ్వరం గణేష్ కుమార్, వయసు: 39 సంవత్సరాలు యాదాద్రి జిల్లా. 4. ఈగజులపాటి శ్రీనాథ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 5. యెనగంధుల వెంకటేష్, జనగామ. 6. కోదురి శ్రావణ్ వయసు: 35 సంవత్సరాలు, జనగామ. 7. కొలిపాక సతీష్ కుమార్ వయసు: 36 సంవత్సరాలు, కొడకండ్ల (ఎం), జనగామ. 8. తడూరి రంజిత్ కుమార్ వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ. 9. దుంపల కిషన్ రెడ్డి, వయసు: 29 సంవత్సరాలు, ఆత్మకూర్ (ఎం), యాదాద్రి జిల్లా, 10. దశరథ మేఘావత్ వయసు: 28 సంవత్సరాలుతురుపల్లి. 11. నారా భాను ప్రసాద్, వయసు: 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట, 12. గొపగాను శ్రీనాథ్, వయసు: 32 సంవత్సరాలు, శివ కుమార్, వయస్సు 33, అమంగల్, నల్లగొండ. 15. అలేటి నాగరాజు, వయస్సు 32, యాదాద్రి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి జిల్లా, 13. ఒగ్గు కర్నాకర్, వయసు: 42 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 14. కమల్ల ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు వివరాలను వెల్లడిస్తూ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు, ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకొని చేల్లించాల్సిన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి అట్టి వసూలు చేసిన డబ్బు నుండి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మద్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఇ చాలాన్ లను ప్రధాన నిందితుడుకి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు అట్టి ధరణీ/భూభారతీ వెబ్సైట్లో ఇన్స్స్పెక్ట్ " ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి ఛలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుము కు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక యం.ఆర్.ఓ/ రిజిస్ట్రేషన్ కార్యాలయములో మద్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొదుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి కావున జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మద్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుండి 30శాతం వరకు కమిషన్ చెల్లించేవారు. ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబందించిన లావా దేవిల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏ.ఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్.ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :