Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!* చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
Admin
Mana Mahati News