Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : డిసెంబర్ 27 వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి కళావైభవం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమంలో వరంగల్ కీర్తి నగర్ కు చెందిన చిన్నారి సహస్ర కూచిపూడి నృత్యంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో రెండవసారి చోటు సాధించింది. 2023 లో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మొదటిసారి రికార్డు కైవసం చేసుకుంది. శ్రీనిధి నృత్య కళాక్షేత్రం గురువు శ్రీమతి పసుపులేటి సరిత శ్రీనివాస్ గారు చిన్నారిని అభినందించారు.
Admin
Mana Mahati News