Wednesday, 29 July 2026 07:35:46 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*వెనెజులాపై అమెరికా దాడి తీవ్రంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి*

Date : 04 January 2026 05:32 PM Views : 183

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *వెనెజులాపై అమెరికా దాడి తీవ్రంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 4 వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన అమెరికా * సైనిక స్థావరంపై దాడి చేసి మదురో దంపతులను బంధించిన యూఎస్ దళాలు * అమెరికా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన, అభ్యంతరం * ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని హెచ్చరించిన యూఎన్ చీఫ్ * నార్కో టెర్రరిజం కేసులో మదురోను న్యూయార్క్‌కు తరలిస్తున్న అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్య ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఈ పరిణామం అంతర్జాతీయ చట్టాలను గౌరవించకపోవడమేనని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. శనివారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన డెల్టా దళాలు వెనిజులాలోని ఒక సైనిక స్థావరంపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఒక యుద్ధనౌకలో న్యూయార్క్‌కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. మదురోపై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో నార్కో-టెర్రరిజం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అంతర్జాతీయ చట్టాలను, యూఎన్ చార్టర్‌ను అందరూ తప్పక గౌరవించాలి. కానీ ఇక్కడ ఆ నియమాలను ఉల్లంఘించడంపై సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ చర్య ఆ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది" అని పేర్కొన్నారు. మానవ హక్కులు, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని గుటెర్రస్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. మరోవైపు, మదురో అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "వారిని ఒక నౌకలో న్యూయార్క్‌కు తరలిస్తున్నాం. హెలికాప్టర్‌లో మంచి ప్రయాణం చేశారని అనుకుంటున్నా" అని ఫాక్స్ న్యూస్‌తో వ్యాఖ్యానించారు. మదురో డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారని ట్రంప్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: