Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఖమ్మం పట్టణం నందు కేవీఎం పాఠశాల శ్రీమతి కత్తుల వీరమ్మ స్మారక బాలికోన్నత పాఠశాల నందు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు (1987 to 1997) వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక గొల్లగూడెం లో గల చేరుకూరి మామిడి తోట యందు ఘనంగా నిర్వహించబడింది.... ఈ కార్యక్రమం యందు ఉపాధ్యాయులు జానకి టీచర్ సరళ టీచర్ చిట్టెమ్మ టీచర్ ఫ్లారెన్స్ టీచర్ శోభ టీచర్ పాల్గొని విద్యార్థులతో తమ అనుభవాలను తమ విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఈ స్థాయికి రావటానికి పడ్డ కష్టం గురించి మాట్లాడటం పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు ఎంతో సంతోషపడ్డారు అలాగే ఈ సమ్మేళనంలో విద్యార్థి విద్యార్థులు మాట్లాడి ఉపాధ్యాయులతో వారికున్న అనుబంధాన్ని నెరవేసుకున్నారు అలాగే వాళ్ళు ఎంత కష్టపడి ఈ స్థితికి చేరుకున్నది వివరించారు..... ముందు తరాలు వారు కూడా వీరిని అనుసరించాల్సిందిగా ఉపాధ్యాయులు కోరుకున్నారు....
Admin
Mana Mahati News