Sunday, 13 September 2026 10:14:43 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా?

Date : 21 January 2026 11:50 AM Views : 225

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణకు హాజరైన హరీష్ రావు .. సిట్ అధికారులకు దొరికిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏడుగున్నర గంటల విచారణ తర్వాత బయటకు వచ్చి.. తెలంగాణ భవన్ లో ప్రెస్మీట్ పెట్టి.. విచారణ వీడియోని రిలీజ్ చేయాలని విచిత్రమైన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకేం సంబంధం అని ..తాను హోంమంత్రిగా చేయలేదన్నారు. అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లను అడగాలని ఎదురుదాడి చేశారు. అంతే కాదు..తానే వారిని ఇంటరాగేట్ చేశానని..తనను ప్రశ్నలు అడగలేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. విచారణ అధికారులకు ప్రతి అరగంటకోసారి ఫోన్లు వచ్చాయని.. అవి సజ్జనార్ చేశారా.. రేవంత్ రెడ్డి చేశారా అని హరీష్ రావు ప్రశ్నించారు. విచారణ వీడియో బయటపెట్టాలి. చిల్లర లీక్ లు ఇచ్చి, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. సిట్ విచారణలో ఏదో జరిగిపోయిందనే పుకార్లు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. నిజానికి హరీష్ రావు విచారణపై ఇంకా ఎలాంటి పుకార్లు రాలేదు. ప్రచారాలు జరగలేదు. అయితే తాను చెప్పింది బయటకు వస్తుందని ఆయన కంగారు పడినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో విచారణ అంతా ఒక పెద్ద ట్రాష్ అని, నిరాధారమైన ఆరోపణలతో అడిగిందే అడుగుతూ కాలయాపన చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య గొడవలు, టెండర్ల దోపిడీపై చర్చను మళ్లించడానికే ఈ ‘సిట్టు-లట్టు-పొట్టు’ డ్రామాలు ఆడుతున్నారని ఉద్యమాలు, అరెస్టులు తమకు కొత్త కాదని చెప్పుకొచ్చారు. హరీష్ రావు స్పందన చూస్తూంటే.. సిట్ విచారణ అంతా ఈజీగా సాగలేదని పక్కా సాక్ష్యాలతోనే ఆయనను ప్రశ్నించారని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనలో ఎప్పుడూ లేనంతకంగారు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :