Mana Mahati News - తెలంగాణ / వరంగల్ : *15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పోలీస్ అధికారి!* హన్మకొండ జిల్లా నివాస్ న్యూస్ జనవరి 8 లంచం తీసుకోవడం నేరము అని అవగాహన కల్పించవలసిన కొంతమంది పోలీస్ అధికారులే లంచాలకు ఆశపడుతున్నారు. లంచగొండి ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్ప టికీ కొందరు అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు.. ఈ నేపథ్యంలోనే గురువారం వరంగల్ కేయూసీ సబ్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీకాంత్ ను ఏసీబీ అధి కారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.ఇటీవల పేకాట కేసులో పట్టుబడ్డ వ్యక్తి నుంచి 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. పేకాటలో పట్టుబడ్డ వ్యక్తి కి సంబంధించిన వాహనాన్ని, మొబైల్ ఫోన్ ను తనకు అప్పగించేందుకు ప్రైవేట్ డ్రైవర్ ద్వారా ఎస్సైని సంప్రదించాడు. దీంతో ఎస్సై శ్రీకాంత్ 15 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం కేయూ జంక్షన్ వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ప్రైవేట్ డ్రైవర్‌ను, ఎస్సైను పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచారు.
Admin
Mana Mahati News