Saturday, 12 September 2026 08:51:02 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*బ్రాండెడ్ సీసాల్లో చీప్ లిక్కర్.. సగం ధరకే ఖరీదైన మద్యం*

Date : 08 January 2026 06:23 PM Views : 194

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *బ్రాండెడ్ సీసాల్లో చీప్ లిక్కర్.. సగం ధరకే ఖరీదైన మద్యం* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 8 హైదరాబాద్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ ఐదుగురు నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన మద్యం స్వాధీనం ఖరీదైన బాటిళ్లలోని మద్యాన్ని తీసి కల్తీని నింపి విక్రయం వాహన తనిఖీల్లో ఇద్దరు పట్టుబడటంతో వెలుగులోకి వచ్చిన దందా రూ. 20 వేల విలువైన బాటిల్‌ను రూ. 10 వేలకే అమ్ముతున్నట్లు వెల్లడి ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నుంచి అసలు మద్యాన్ని తీసేసి, దాని స్థానంలో కల్తీ మద్యాన్ని నింపి అమ్ముతున్న ఓ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 139 నింపిన మద్యం బాటిళ్లు, 136 ఖాళీ సీసాలు, ఒక స్కూటీ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ మార్గంలో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, స్కూటీపై వెళుతున్న దేశిని ప్రకాశ్‌ గౌడ్, గద్వాల భరత్‌లను ఆపారు. వారి వద్ద 15 ఖరీదైన బ్రాండ్ మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని పరిశీలించగా, సీసాల్లో కల్తీ మద్యం ఉన్నట్లు తేలింది. వారిని విచారించగా ప్రకాశ్‌ గౌడ్ తమ్ముడైన అరవింద్ ఇంట్లో ఈ దందా నడుస్తున్నట్లు ఒప్పుకున్నారు. అరవింద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఒడిశాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి అనే వ్యక్తి ఈ కల్తీ బాటిళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. వెంటనే మహంతి ఇంటిపై దాడి చేసిన పోలీసులు, అక్కడ 54 మద్యం బాటిళ్లను, ఈ దందాలో భాగస్వామి అయిన విక్రమ్ వద్ద మరో 24 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు పలికే మద్యం బాటిల్‌ను కల్తీ చేసి రూ. 10 వేలకే విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. ఈ దాడిలో పాల్గొన్న డీటీఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ, డిప్యూటీ కమిషనర్ దశరథ్ అభినందించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: