Monday, 14 September 2026 10:57:10 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

*ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...*

Date : 11 January 2026 01:21 PM Views : 230

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుప్తనిధుల కోసం దేవుడి విగ్రహం కింద తవ్వకాలు చేసిన ఘటన కలకలం రేపింది. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో సాగిన ఈ అక్రమ తవ్వకాలను పోలీసులు అడ్డుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల మాదాపూర్ గ్రామ పరిధిలోని కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి ఈసీఐఎల్‌కు చెందిన పులి కుమార స్వామిని సూపర్‌వైజర్‌గా నియమించాడు. అయితే నెలసరి వేతనం సరిపోవడం లేదని భావించిన కుమార స్వామి, ఈజీ మనీ కోసం గుప్తనిధులపై కన్నేశాడు. వ్యవసాయ భూమిలో ఉన్న చిన్న గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటంతో, దాని కింద గుప్తనిధులు ఉంటాయని అతడు నమ్మాడు. ఈ ఆలోచనతో విజయవాడకు చెందిన రామినేని కృష్ణా కిషోర్, పాబోలు శ్రీనివాస్, ఆకుల నరసింహ రావు, ఖమ్మంకు చెందిన తాత కృష్ణకాంత్, బొమ్మల రామారంకు చెందిన వేణులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించి హిటాచీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. అయితే గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన హిటాచీ యంత్రం, కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో గుప్తనిధుల తవ్వకాలు చేయడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. గుప్తనిధుల పేరుతో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :