Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *బ్రేకింగ్ న్యూస్*బయటపడిన మరో రూ.2 వేల కోట్ల భూ కబ్జా స్కామ్!* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబపేటలో భారీ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 44లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ భూకబ్జా ముఠా కన్నేసింది. 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ప్రభుత్వ భూమిని కాజేయడానికి యత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ కబ్జాకు సబ్ రిజిస్టర్ సహకరించినట్లు విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయడంలో సహకరించినందుకు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్టర్–2గా పనిచేస్తున్న కె. మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మరోసారి అక్రమాల గుట్టు రట్టయ్యింది.
Admin
Mana Mahati News