Tuesday, 28 July 2026 05:41:56 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...*

Date : 10 January 2026 04:59 PM Views : 199

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్ వరంగల్ నగరంలో చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను కాజిపేట్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు: 1) కొడుపాక నరేష్ వయస్సు: 42 సంవత్సరాలు గ్రామం ఘవాపూర్ గ్రామం, పెద్దపల్లి జిల్లా మరియు 2) వెల్పుల యాదగిరి, వయస్సు: 32 సంవత్సరాలు, నివాసం శాంతినగర్, పెద్దపల్లి టౌన్, పెద్దపల్లి జిల్లా కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశం వివరాలు వెల్లడిస్తూ గత డిసెంబర్ నెల 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగటనలో బాలుడి తండ్రి కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా కాజిపేట్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారించగా నేరాస్తలం లో లభించిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరు ఈ రోజు ఉదయం అద్దెకు తీసుకున్న కారులో మళ్ళీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అనుమనస్పదంగా కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫూట్ పాత్ వద్ద రెక్కి నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు పట్టుకొని విచారించగా వాళ్లు 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబు కిడ్నాప్ తో పాటుగా గతంలో నలుగురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఇట్టి పిల్లలను వీళ్ళు పిల్లలు కలగలేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బులకు అమ్ముకున్నారు. 28 డిసెంబర్, 2025 రోజున కిడ్నాప్ చేసిన ఐదు నెలల బాబుని జన్నారం మండలం లింగయ్యపల్లీ గ్రామంలో, ఇదే విదంగా గతంలో ఇద్దరు నిందితులు కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లల్లో 2025 ఆగస్టు లో వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాం పైన తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను మంచిర్యాల జిల్లా నస్పూర్ లో, 2023 అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాబును జన్నారం మండలంలో, 2025 అక్టోబర్ నెలలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిదురిస్తున్నటువంటి 05 నెలల పాపను మంచిర్యాలలో మరియు 2025 జూన్ నెలలో రామగుండం రైల్వే స్టేషన్ ముందు తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను జగిత్యాల జిల్లాలో అమ్మినారు. ఇట్టి నేరస్తుల నేర ఒప్పుకోలు ఆధారంగా కాజీపేటలో అపహరణకు గురైన ఐదు నెలల బాబు మల్లన్నతో పాటుగా మిగతా నలుగురు పిల్లల పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. చిన్నపిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీ లు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది తో పాటు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :