Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : వసూళ్లకు పాల్పడిన జర్నలిస్టుల అరెస్ట్* తొర్రూరు కు చెందిన ముగ్గురు విలేకరులకు రిమాండ్ నిందితులు నమస్తే తెలంగాణ, టీ న్యూస్, సిగ్నేచర్ స్టూడియో రిపోర్టర్లుగా గుర్తింపు.. తొర్రూరు : అక్రమాలు, అవినీతిని వెలికి తీసి సమాజానికి దారి చూపే జర్నలిస్టులు కొందరు వక్రమార్గంలో పయనించి కటకటాల పాలవుతున్నారు. తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రిపోర్టర్లు, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ లు అక్రమ వసూళ్లకు పాల్పడి పోలీసులకు పట్టుబడటం చర్చానీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... తొర్రూరుకు చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ పోల్ రాజు, టీ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ జాటోతు ఉపేందర్ లు ఈజీ మనీ కి అలవాటు పడి దందాలకు తెర తీశారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ ముగ్గురు ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల అవతారం ఎత్తారు. కారుకు సైరన్ బిగించి ఆయా గ్రామాల్లో అధికారుల పేరిట హల్చల్ చేశారు. ప్రచారం కోసం తిరిగిన పార్టీ కార్యకర్తలకు విందు ఇద్దామని సర్పంచ్ అభ్యర్థులు మద్యం తీసుకు వెళ్తుంటే వారిని వెంబడించి బెదిరించి పలు గ్రామాల్లో డబ్బులు రాబట్టారు.
Admin
Mana Mahati News