Sunday, 13 September 2026 10:25:49 AM
# పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష # జై భీమ్ సేవా దళం(భారత్) ఆధ్వర్యంలో ఘనముగా మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు* # కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి # పవర్‌స్టార్ నుంచి పవర్‌ఫుల్ లీడర్‌గా.. ఓటమిని జయించిన యోధుడు పవన్ కళ్యాణ్ # ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వర్ రావు పదవీ విరమణ వేడుక # త్వరలో తమిళనాడు దళిత యువ ముఖ్యమంత్రి - జేసెప్ విజయ్ ను కలవడానికి - బైక్ యాత్ర కు సహకరించండి # నవ దంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు* # నూతన వధూవరులను ఆశీర్వధించిన భూక్యా సురేష్ నాయక్* # వైదిక కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి పరామర్శ # *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...*

* *ఖగోళ ప్రాముఖ్యత లేని జనవరి 1*

Date : 30 December 2025 06:07 PM Views : 243

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *ఖగోళ ప్రాముఖ్యత లేని జనవరి 1* హైదరాబాద్ నివాస్ న్యూస్ డిసెంబర్ 30 డిసెంబర్ 31 రోజున అందరికీ ఎక్కడ లేని హడావుడి.. ఎందుకంటే న్యూ ఇయర్ అట.. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుందని సంబరాలు చేసుకుంటారు.. మీరంతా సంబరాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవు.. కానీ మనం సమగ్రమైన భారత కాలమానాన్ని మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అని గమనించాలి. భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం.. ఎలాగో గమనించండి. భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో దినం మొదలవుతుంది.. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుఝాము నుండి మరునాటి తెల్లవారు వరకూ.. కానీ గ్రెగోరియన్ క్యాలండర్ మాత్రం అర్ధరాత్రి పూట దినం మొదలవుతుంది.. అది తిరిగి అర్ధరాత్రి వరకూ కొనసాగుతుంది. సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారు ఝామునే నిద్ర లేస్తుంది.. మనుషులంతా ఉదయాన్నే నిద్ర లేచి దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతాం.. పక్షుల కిలకిలరావాలు సుమధురంగా వినిపించేది.. తోటల్లో పూవులు వికసిస్తాయి.. ఆవులు దూడలకు పాలను ఇస్తాయి.. మరి ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూశారా? ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం మీరు ఎక్కడైనా చూశారా? మనం ఆలయాల్లో సుప్రభాత ప్రార్ధనలు తెల్లవారునే ఎందుకు చేస్తాం? అర్ధరాత్రి ఎందుకు చేయం.. మన పండుగలు భారతీయ కాలమానం ప్రకారమే జరుపుకుంటున్నం.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైనా జరుపుకుంటున్నామా? భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది.. సూర్యమానమైనా, చంద్రమానమైనా గ్రహాల గమనం, ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది.. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు.. రోమన్లు, గ్రీకులు పాటించే గ్రెగోరియర్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది.. యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైనా బలవంతాన రుద్దబడింది.. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది. నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్నభారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం.. గ్రెగేరియన్ క్యాలండర్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి.. మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సింది ఉగాది రోజునే.. జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నియమం ఏమీ లేదు.. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ను అనుసరిస్తున్నాయి.. దీన్ని మనం క్యాలెండర్ మార్పుగానే గుర్తించాలి.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :