Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఎస్ఆర్ డీ.జీ. స్కూల్లో సంక్రాంతి సంబరాలు* శేరిలింగంపల్లి నివాస్ న్యూస్ జనవరి 10: మాదాపూర్‌లో ని, ఎస్ఆర్ డిజి పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో తీర్చిదిద్ది తమ ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ విశిష్టతను, రైతు ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ నేపథ్యానికి తగ్గట్టుగా పాఠశాల అంతటా మామిడి తోరణాలు, పూలతో అలంకరించారు. అందరూ కలిసి సంప్రదాయ రీతిలో పొంగలి వండి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. నేటి తరానికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో డి. జి.ఎం అరుణ , సుచరిత జానల్ ఇంచర్డ్, అర్చన ప్రిన్సిపాల్, గ్రామ్ ఎ.జి.ఎం తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News