Mana Mahati News - తెలంగాణ / సంగారెడ్డి జిల్లా : బీఆర్‌ఎస్‌కు షాక్ – బీజేపీలో భారీ చేరికలు! 12వ వార్డులో బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్. 50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరిక. సంగారెడ్డి, ఫిబ్రవరి 03,మన మహతి న్యూస్....సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్ సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సాహితీ రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయనకు ఘన విజయం సాధించేలా కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.
Admin
Mana Mahati News