Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *వైభవంగా జరిగిన కూడారై ఉత్సవం* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ:పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందు గల శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆదివారం ఉదయం కూడారై ఉత్సవం (108 గిన్నెల తో ప్రసాద వేడుక) అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకలో పాల్గొన్న భక్తులకు గిన్నె ప్రసాదంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వారి తరఫు నుంచి ఆంగ్లం నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులందరికీ దేవాలయం ప్రధాన అర్చకులు గొడవర్తి రంగనాథ ఆచార్యులు చే ఆశీర్వచనం మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
Admin
Mana Mahati News