Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ఆవాసాలు, విద్యాసంస్థల్లో గిరిజన ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్‌ను ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆరా తీశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, ఈఈ మధుకర్‌కు సూచించారు. పనుల నాణ్యతలో రాజీ లేకుండా, గిరిజనులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Admin
Mana Mahati News