Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్ కాలనీ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) బుధవారం సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ షెడ్,పల్లె ప్రకృతి వనం,క్రీడా మైదానం, వీవో భవన నిర్మాణ పనులను పరిశీలించారు.నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జర్పుల దేవి, పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు. గ్రామంలో అన్ని పనులు నిత్యం సక్రమంగా జరిగేలా చూడాలని లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీఓకు అమ్మ సాంబయ్య కు సూచించారు.
Admin
Mana Mahati News