Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : మన మహతి న్యూస్ :లక్ష్మీదేవిపల్లి సమ్మక్క గద్దెల వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల మండప నిర్మాణ పనులను శ్రీ సిద్ధి వినాయక @2.0 ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి పూజా కార్యక్రమమైన కర్రపూజ (అంకురార్పణ) నిర్వహించి,మండప నిర్మాణ పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా సాగాలని, గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరగాలని కోరుకుంటూ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ముందస్తుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కోలాటం కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు,యువత ప్రజలు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News