Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలోని భజన మందిరం దగ్గర గల శ్రీ చైతన్య పాఠశాలలో జన్మాష్టమి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఉట్టి కొట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రీ ప్రైమరీ ప్రైమరీ చిన్నారులు గోపిక కృష్ణుల వస్త్రధారణతో అలరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాల ద్వారా చక్కని ఆధ్యాత్మిక వాతావరణం పాఠశాలలో నెలకొన్నది. పాఠశాల ప్రిన్సిపల్ రామారావు,మధు, ప్రైమరీ ఇంచార్జ్ స్రవంతి, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ రేణుక మేడం మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ శ్రీ చైతన్య సంస్థల చైర్మన్ శ్రీధర్ ,డైరెక్టర్ శ్రీవిద్య , ఏటీఎం వీరన్న చిన్నారులకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
Mana Mahati News