Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.స్థానిక మండల పరిధిలోని కిన్నెరసాని ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్‌సీని తక్షణమే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News