Tuesday, 27 October 2026 06:57:18 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు*

Date : 30 September 2026 01:36 PM Views : 192

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మొబైల్ ఫోన్లు కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఒక బంగారు గొలుసును కొనుగోలు చేసేందుకు కనికరం లేని తల్లిదండ్రులు తమ కడుపున పుట్టిన బిడ్డను కాసులకు అమ్మేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‍లో చోటుచేసుకుంది. ఈ కేసులో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, 550 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌లో ఉన్న ఆ పసికందును కూడా కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులైన దంపతులు తమ నెల రోజుల వయసున్న బిడ్డను రూ.1.20 లక్షలకు విక్రయించారు. ఆ డబ్బుతో రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఒక బంగారు గొలుసు కొనుగోలు చేశారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. వారు కొనుగోలు చేసిన ఫోన్లు, బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పసికందు పలు చేతులు మారింది. తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన మధ్యవర్తులు, చిన్నారిని మరికొందరికి ఎక్కువ ధరకు విక్రయించారు. ఇలా పలు దఫాలుగా అమ్మకాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. చివరకు హైదరాబాద్ లోని ఒక వ్యక్తి వద్దకు చిన్నారి చేరింది. అరెస్టయిన వారిలో పసికందు తల్లిదండ్రులతో పాటు ఈ క్రయవిక్రయాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన కొందరు వ్యక్తులు, ఒక నకిలీ డాక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ డాక్టర్ పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఈ క్రయవిక్రయాల గొలుసుకట్టును ఛేదించారు. హైదరాబాద్లో చిన్నారి ఆచూకీని గుర్తించి, స్థానిక పోలీసుల సహాయంతో పసికందును సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :