Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* అబ్దుల్లాపూర్ మెట్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన.. *AO-1: శ్రీ బతుక శ్రీనివాసులు, మండల సర్వేయర్,* *AO-2: శ్రీ బి. సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం* ఇరువురు కలిసి ఒక భూమి సంబంధిత పని కోసం ఫిర్యాదుదారుని నుండి *రూ. 20,00,000/- (రూపాయలు ఇరవై లక్షలు)* లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా *అవినీతి నిరోధక శాఖ (ACB), సిటీ రేంజ్ - CIU* అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుని భూమి విషయంలో అధికారికంగా చేయవలసిన పనికి అక్రమంగా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ACB విచారణలో తేలింది... నిందితుల నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
Admin
Mana Mahati News