Tuesday, 27 October 2026 06:56:45 PM
# *గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* # *‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇ‍ప్పుడేం చేయనున్నారు?...* # *సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు..* # *చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు..* # *రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన విద్యుత్ ఏఈ..* # *హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు...* # *ఫోన్‌ కొట్టేద్దామంటే.. ప్రాణమే పోయేది....* # *నా కుమార్తెపై ఎవరో అత్యాచారం చేశారు!" అంటూ పోలీసులకు ఫిర్యాదు.. చివరికి అనుమానితుడిగా మారిన తండ్రి! విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు!.....* # *ముగ్గురిని చంపి.... అన్నీ మా నాన్నే చూసుకుంటారు...* # వచ్చే నెలలో పెళ్లి.. అదే ఆమె చివరి డేటింగ్‌!..* # *హైదరాబాద్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి రూ.21 లక్షలు దోపిడీ.!..* # 20 లక్షల లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ ఇద్దరు అధికారులు* # *గాంధీ జయంతి సందర్భంగా పెద్దతండ గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గుగులోత్ వినోద రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామసభ..* # *ఆ ఒక్క బటన్.. 174 మందికి ప్రాణభిక్ష...* # _*లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సులేమాన్ షా ఎన్‌కౌంటర్...._* # మొబైల్ ఫోన్లు *కొనుగోలు కోసం కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు* # పోలరం గ్రామపంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం # శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లోటస్ బ్రాంచ్ లో ఘనంగా శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు # బీబీఎం హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు # కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

సంపూర్ణ అక్షరాస్యతకు ప్రతి పౌరుడు కృషి చేయాలి – ఉల్లాస్‌ నవభారత సాక్షరత రిసోర్స్‌ పర్సన్‌, కూనవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్‌ షేక్

Date : 27 September 2026 04:41 PM Views : 51

Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ఉల్లాస్‌ నవభారత సాక్షరత రిసోర్స్‌ పర్సన్‌, కూనవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్‌ షేక్‌ మీరా హుస్సేన్‌ అన్నారు.కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉల్లాస్‌ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా వయోజన అభ్యాసకులకు నిర్వహించిన మూల్యాంకన పరీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.చదువు జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల వంటిదని,చదువుకు వయస్సు అడ్డంకి కాదని అన్నారు.సమాజ అభివృద్ధికి అక్షరాస్యత ఎంతో దోహదపడుతుందని,ప్రతి మనిషికి అక్షరం జ్ఞాన కిరణమని పేర్కొన్నారు. సమాజంలోని అనేక రుగ్మతలకు చదువు పరిష్కారం చూపుతుందని తెలిపారు.ఉల్లాస్‌ కార్యక్రమంలో వయోజనులు ఆసక్తితో చదివి అక్షరాస్యులు కావాలని సూచించారు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జాతీయ సార్వత్రిక విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉల్లాస్‌ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.వయోజనులకు బోధిస్తున్న స్వచ్ఛంద ఉపాధ్యాయులకు బోధనా మెలకువలను రిసోర్స్‌ పర్సన్‌లుగా అందిస్తున్నామని తెలిపారు.త్వరలోనే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూనవరం గ్రామ సర్పంచ్‌ ఎన్నిక శ్వేత, ఉపసర్పంచ్‌ మనోజ్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ సత్యనారాయణ, కోఆపరేటివ్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ, ఎంఎస్‌ అధ్యక్షురాలు మౌనిక, వీవోఏలు ధనలక్ష్మి, మల్లీశ్వరి, ఆశా కార్యకర్త, ఇన్విజిలేటర్‌ పుల్లమ్మ, గ్రామ పెద్దలు, అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు.

Hema

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: