Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : ????*గట్టుసింగారంలో అవినీతి కార్యదర్శి ప్రసాదం..!* ????*అక్రమ నిర్మాణానికి కొండంత అండ దండలు* ????*నోటు మాటున నోటీసుల పేరుతో హై డ్రామాలు* ????*తెరవెనుక కథ,స్క్రీన్ ప్లేతో పరోక్ష సహకారం* :అమ్యామ్యాలు అందజేస్తే చాలు.... తెర వెనుక చేసే అక్రమాలకు అండగా ఉంటానని పంచాయితీ కార్యదర్శి ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. కూసుమంచి మండలంలోని గట్టుసిం గారం గ్రామంలోని ఓ అనుమతి లేని రియల్ వెంచర్ లో గ్రామపంచాయితీ అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులే అందుకు నిదర్శనం/ఉదాహరణగా కనబడుతున్నాయి. నిర్మాణ పనులను అడ్డుకోవాల్సిన బాధ్యత గల పంచాయితీ కార్యదర్శి అక్రమ నిర్మాణదారుడి నుండి ముడుపులు తీసుకుని ఈ అక్రమ నిర్మాణానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నాడనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తున్నాయి. గ్రామ స్థాయిలో వివిధ రకాల పంచాయతీ పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన కార్యదర్శి అక్రమ నిర్మాణానికి వత్తాసు పలకడం పలు అనుమానాలకి తావి స్తుంది. అక్రమ ఆదాయం ద్వారా తన జేబు నిండితే చాలు ప్రభుత్వ, పంచా యితీ ఆదాయానికి గండి కొడితే నాకేంటి అనుకున్నాడేమో అక్రమ నిర్మా ణాన్ని ఆపకుండా మిన్నకుండిపోయాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ఎలాంటి అవరోధాలు లేకుండానే జరుగుతున్నాయి.* ????*లోపాయకారి ఒప్పందం, నోటీసులతో హడావుడి..* ????*గట్టుసింగారం గ్రామంలో రియల్ ఎస్టేట్ బడాబాబు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నోటు మాటున నోటీసుల పేరుతో హడావుడి చేసిన అవినీతి కార్యదర్శి ప్రసాదం.ఆపై తెరవెనుక నుండి కథ, స్క్రీన్ ప్లే నడిపిస్తూ హైడ్రామా ప్రదర్శించాడనే విమర్శలు గ్రామస్తుల్లో వినిపిస్తున్నాయి.నోటీసు కి బదులుగా నోటుతో సమాధానంగా లోపాయకారి ఒప్పందం కుదరడంతో సదరు బడాబాబు దర్జాగా అక్రమ నిర్మాణ పనులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడని గుసగుసలాడుతున్నారు. ఉండగా ఈ అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్ ను కూడా అక్రమంగానే వినియోగించుకోవడం గమనార్హం. కాగా వివిధ రకాల పనుల పై పంచాయితీ కార్యాలయానికి వచ్చే నిరక్షరాస్య ప్రజల పై అధికార దర్పం ప్రదర్శిస్తూ కొర్రీలు పెడుతూ దరఖాస్తులను తిరస్కరించే కార్యదర్శి సుమారుగా యాభై లక్షల రూపాయలతో అనుమతి లేకుండానే చేపడుతున్న కమర్షియల్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అడ్డుకట్ట వేయకపోవడం పై జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.*
Admin
Mana Mahati News